తమిళనాడు (Tamil Nadu) లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం నియోజకవర్గంలోని అవనియాపురం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Bihar Elections: మోగిన బీహార్ ఎన్నికలు

శనివారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎంజీఆర్ విగ్రహం (MGR statue) ముఖభాగాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆగ్రహావేశానికి లోనయ్యారు. వెంటనే పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కార్యకర్తలు కిందపడి ఉన్న విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నిలబెట్టారు. ఈ సంఘటనపై పార్టీ జిల్లా నాయకులు అవనియాపురం (Avaniapuram) పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.ఈ ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. ఎంజీఆర్ కీర్తిని, ఆయన సిద్ధాంతాలను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నిందితులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: