हिन्दी | Epaper

Telugu news: MGNREGA: ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు

Tejaswini Y
Telugu news: MGNREGA: ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు

MGNREGA: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పథకం పేరును పూర్తిగా మార్చుతూ, ఇప్పటి వరకు కొనసాగుతున్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme)’కు బదులుగా ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా పునర్‌నామకరణం చేసింది. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.

Read Also : Reliance: కూతురు ఈషా కోసం మెగా IPOకి ప్లాన్ చేస్తున్న ముఖేష్ అంబానీ

MGNREGA
MGNREGA: New name for the employment guarantee scheme

గ్రామీణ ఉపాధి పథకానికి 1.51 లక్షల కోట్లు

ఇక పనిదినాల్లో కూడా పెద్ద మార్పు చేశారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులుగా విస్తరించారు. గ్రామీణ కార్మికులకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని కూడా పెంచుతూ రూ.240కి పెంచాలని నిర్ణయించారు. పథకాన్ని మరింత బలపర్చడానికి కేంద్రం రూ.1.51 లక్షల కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది.

2005లో ప్రారంభమైన ఈ ఉపాధి పథకం యూపీఎ ప్రభుత్వం కాలంలో అమల్లోకి వచ్చింది. తర్వాత దీనికి మహాత్మా గాంధీ పేరు జతచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి భద్రతను పెంపొందించేందుకు, నైపుణ్యం లేని కార్మికులకు సంవత్సరానికి కనీసం 100 రోజుల పని హామీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ఇప్పుడు పనిదినాల పెంపుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం చేసిన తాజా మార్పులతో గ్రామీణ ఉపాధిలో నాణ్యత, స్థిరత్వం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

టోల్ బాదుడు షురూ, FASTag పాస్ ధర పెరిగింది

టోల్ బాదుడు షురూ, FASTag పాస్ ధర పెరిగింది

కేరళ ఎన్నికలు వేడెక్కాయి, LDF అభ్యర్థుల జాబితా విడుదల

కేరళ ఎన్నికలు వేడెక్కాయి, LDF అభ్యర్థుల జాబితా విడుదల

మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు

మా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారని, డీకే సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870