West Bengal politics: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే, మహిళలు తాము వంటగదిలో ఉపయోగించే పరికరాలతో సిద్ధంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓటు హక్కును లాక్కోవడానికి చేసే ఏ ప్రయత్నాన్నీ సహించబోమని ఆమె హెచ్చరించారు.
Read also: IRCTC: తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్ – ప్రత్యేక ఆఫర్!

యువతుల పేర్లు తొలగించే కుట్రలు
ఎన్నికల జాబితా నుంచి మహిళల, యువతుల పేర్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకొచ్చి బెదిరింపులు చేస్తున్నారని మమత ఆరోపించారు. మీ పేరు జాబితాలో లేకుంటే, మీ వంటగది సామగ్రి మీకు ఆయుధమని ఆమె పేర్కొన్నారు. మహిళలే ముందుండి ఇలాంటి అన్యాయాలకు ప్రతిఘటిస్తారని ఆమె అన్నారు.
బెంగాల్ ప్రజలను విభజించే ప్రయత్నం
మహిళలు బలమా? లేక బీజేపీ బలమా? అన్నది ఈసారి స్పష్టమవుతుందని వ్యాఖ్యానిస్తూ, తాను లౌకికతను విశ్వసిస్తానని మమత స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల సమయంలో బెంగాల్ ప్రజలను విభజించే ప్రయత్నంలో భాగంగా డబ్బులు పంచుతోందని, ఇతర రాష్ట్రాల నుంచి పనివారిని తీసుకొస్తోందని ఆమె విమర్శించారు.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు ప్రజలను ఏకాలంలోనూ విభజించలేదని ఆమె గుర్తుచేశారు. స్వాతంత్ర్యం కోసం బెంగాల్ ప్రజలు చేసిన త్యాగాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు భారత పౌరులుగా ఏకతను కాపాడుకోవడం మన బాధ్యత అని మమత పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: