పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన “గంధా ధర్మ్” (Gandha Dharma) వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని ఈ రూపంలో హేళన చేయడం సర్వధర్మ సమభావానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు హిందూ సమాజానికి అవమానకరంగా మారాయని “మమతా బెనర్జీపై చర్యలు తీసుకోరా?” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
పవన్ ట్వీట్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన ట్వీట్‌లో లా స్టూడెంట్ అయిన శర్మిష్ఠను ఉదహరించారు. ఆమె ఓపీఎస్ సిందూర్ని విమర్శించి తరువాత క్షమాపణలు చెప్పినా, ఆమెపై పోలీసులు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఇదే తీరుగా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన TMC ఎంపీలు, నాయకులు మాత్రం క్షమాపణలు చెప్పకుండా బహిరంగంగా మాట్లాడుతుండటం శోచనీయమన్నారు.
రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నదా WB పోలీస్ వ్యవస్థ?
పవన్ కల్యాణ్ పరోక్షంగా పశ్చిమ బెంగాల్ పోలీసు వ్యవస్థను ప్రశ్నించారు. “ఒక పక్క సామాన్య విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటారు. మరొక పక్క సనాతన ధర్మాన్ని అవమానించే రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోరా? ఇది ఏ రకమైన న్యాయం?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే – ధర్మాన్ని అవమానపరిచే వ్యాఖ్యలకు అంతేబండి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని.
దేశవ్యాప్తంగా మారుతున్న ధర్మ వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలపై పలు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెరుగుతోంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలుగా భావిస్తున్నారని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజలు ధర్మానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందో, రాజకీయం వేరు, భక్తి వేరు అనే విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఎంతదో మరొకసారి తెలియజేస్తోంది.
Read Also : TDP vs YCP : అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం