Maharashtra muslim reservation : మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లింలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు సామాజిక సంక్షేమ శాఖ తాజా జీవోను విడుదల చేసింది. గత పదేళ్లుగా చట్టపరమైన అడ్డంకుల కారణంగా అమలులో లేని ఈ కోటాను ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు.
అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ముస్లింలను స్పెషల్ బ్యాక్‌వర్డ్ క్లాస్-ఏ (SBC-A) కేటగిరీలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే బాంబే హైకోర్టు స్టే విధించడంతో పాటు, ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చకపోవడంతో అది అమలులోకి రాలేదు. అనంతరం సుప్రీంకోర్టు విచారణల్లో కూడా ఈ కోటా కొనసాగలేదు.
Read Also: Rajyasabha : రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

ఇప్పటి వరకు పాత జీవో ప్రభుత్వ రికార్డుల్లో కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులతో దానిని రద్దు చేసి సంబంధిత సర్క్యులర్లన్నీ ఉపసంహరించారు. ఇకపై ఈ కేటగిరీ కింద కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయరాదని స్పష్టం చేశారు. ఇది కేవలం పరిపాలనా సవరణ మాత్రమేనని, రికార్డులను సరిచేయడమే లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మైనారిటీల అభివృద్ధికి ఇది దెబ్బతీసే చర్య అని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: