మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ. వందరూపాయలు కూడా ఇవ్వరని అలాంటిది(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.(Devendra Fadnavis) లక్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్ కు కృతజ్ఞతగా బీజ పీకి ఓటు వేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను ఆయన కోరారు. ఫడ్నవీస్ రూ.1,500 ఇవ్వడం బాగానే ఉన్నా భర్తలు తమ భార్యలకు డబ్బు ఇవ్వరని చెప్పడం సరైంది కాదని విమర్శిస్తున్నారు.
Read also: హిల్ట్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకూడదు: బీజేపీ ఫిర్యాదు

రేపట్నుంచి మున్సి పల్ ఎన్నికలు
డిసెంబరు 2న(Maharashtra) మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ.1,500 స్టైఫండ్ ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఫడ్నవిస్ అధికారంలో లేకపోతే మీ అకైంట్లు డబ్బులు పడేవా? అని అడిగారు. అందుకు ఫడ్నవిస్ పట్ల విధేయత చూపించాలని విజ్ఞప్తి చేశారు. రక్షా బంధన్ సమయంలో కూడా సోదరులు తమ సోదరీమణులకు డబ్బు బహుమతిగా ఇచ్చేటప్పుడు వారి భార్యల అనుమతి తీసుకుంటారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహాయుతి మిత్రులపై కూడా మంత్రి విమర్శలు చేశారు. పాలకవర్గంలోని కొన్ని పార్టీలు ఖజానా తమ దగ్గర ఉందని చెప్పుకుంటున్నప్పటికీ తుది ఆమోదం బీజేపీదేనని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: