మహారాష్ట్ర(Maharashtra elections)లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని అనేక మున్సిపల్ కౌన్సిల్లు(Municipal councils) మరియు మున్సిపల్ పంచాయతీల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన గడువు పూర్తైన తరువాత కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది.
Read Also: Retirement dues: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

ఆదివారం రాత్రి ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాచార ప్రకారం, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు అమలు చేయకపోవడం, అలాగే సాగుతున్న న్యాయపరమైన కేసులు కారణంగా సుమారు 20 నగర పరిషత్‌లు, నగర పంచాయతీల్లో పోలింగ్ వాయిదా పడింది. డిసెంబర్ 2న జరగాల్సిన ఈ ఎన్నికలను ఇప్పుడు డిసెంబర్ 20కి మార్చినట్టు వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: