हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Madhya Pradesh Crime: హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

Saritha
Madhya Pradesh Crime: హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా ధరమ్‌పురి గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో దారికాచి సొంత బాబాయ్ కడతేర్చాడు. అక్కా తమ్ముడు శీతల్ (20), కుల్దీప్ (18) అనే ఈ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం ఉదయం తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తుండగా, మృత్యువు వారిని వెన్నాడుతూ వచ్చింది. ఉదయాన్నే హాల్‌ టిక్కెట్లు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ఇంటి నుంచి కొద్దిదూరం వెళ్లగానే, దారిలో పొంచి ఉన్న వారి సొంత బాబాయ్ హరిసింగ్ మాలవీయ ఒక్కసారిగా కర్రతో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు.

Read Also: War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

Madhya Pradesh Crime: హాల్ టికెట్లు రక్తసిక్తమయ్యాయి.. అక్కాతమ్ముళ్ల దారుణ హత్య
Madhya Pradesh Crime: Hall tickets were stained with blood.. Brutal murder of siblings

రక్తంతో తడిసిన హాల్‌టిక్కెట్లు

పరీక్ష రాసేందుకు వెళ్లిన బిడ్డలు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకుని కుటుంబానికి వెలుగునిస్తారనుకున్న బిడ్డలను సొంత బాబాయే కొట్టి చంపడం కలిచివేస్తోంది. వారి హాల్‌టిక్కెట్లు రక్తంతో తడిసిపోవడం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. వాళ్లు పరీక్షకు వెళుతున్నారని అతడి(వారి బాబాయి)కి తెలుసు. ఉదయం నుంచే అక్కడ కాపుకాచి మా ఇంటి దీపాలను ఆర్పేశాడు. చదువుకుని గొప్పవాళ్లవుతారనుకుంటే.. ఇలా శవాలుగా పడి ఉన్నారు అంటూ మృతుల తండ్రి జగదీశ్ మాలవీయ రోదించారు. కుటుంబ ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. హత్య చేసి పారిపోయిన హరిసింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870