LPG Gas Crisis: దేశంలో ఏర్పడిన వంట గ్యాస్ (LPG) కొరత ఇప్పుడు రైల్వే ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, రైళ్లలో కేటరింగ్ సేవలను తాత్కాలికంగా ఆపేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీనిపై అధికారులు ప్రస్తుతం తీవ్రంగా చర్చిస్తున్నారు, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Read Also: LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

కేటరింగ్ సేవలపై ప్రభావం
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ (IRCTC) తన బేస్ కిచెన్లు మరియు పాంట్రీ కార్ల ద్వారా ప్రతిరోజూ దాదాపు 17 లక్షల మందికి భోజన సౌకర్యం కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఈ భారీ స్థాయిలో వంట చేయడం కష్టతరంగా మారింది. ఒకవేళ కేటరింగ్ సేవలు నిలిపివేస్తే, ముందుగా ఫుడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు:
ప్రయాణికులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ఐఆర్‌సీటీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
- రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, కేటరింగ్ యూనిట్లు గ్యాస్‌కు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లను వాడాలని సూచించింది.
- ‘రెడీ టు ఈట్’ (Ready-to-eat) ఆహార పదార్థాలను తగినంత మొత్తంలో నిల్వ చేసుకోవాలని ఆదేశించింది.
- జన్ ఆహార్ వంటి అవుట్‌లెట్లలో విద్యుత్ ఆధారిత వంట పరికరాలను ఉపయోగించి ఆహార సరఫరా కొనసాగేలా చర్యలు చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: