हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

Sudha
Latest Telugu news : Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

కరూర్‌లో టీవీకే పార్టీ చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట (Karur Stampede) ఘటన పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ విచారణకు (SIT investigation) ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. తొక్కిసలాట ఘటనకు (Karur Stampede) సంబంధించిన కేసులో టీవీకే పార్టీ నేతకు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాస్‌ హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ టీవీకే నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని కోర్టు ప్రశ్నించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. అంతేకాదు టీవీకే చీఫ్‌ వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేయలదేని కూడా ప్రశ్నించింది. ఈ మేరకు ఘటనపై సిట్‌ విచారణకు ఆదేశించింది.

Karur Stampede - కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..
Karur Stampede – కరూర్‌ తొక్కిసలాటపై .. సిట్‌ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు..

ఇదిలావుంటే తొక్కిసలాట (Karur Stampede)బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మీ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ కోర్టు.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయ్‌ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

2025 కరూర్ తొక్కిసలాట నేపథ్యం?

2025 సెప్టెంబరు 27న, భారతదేశంలోని తమిళనాడు కరూర్ లో జరిగిన రాజకీయ ర్యాలీలో అభిమానుల తొక్కిసలాట జరిగింది. దీనికి నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ, తమిళగ వెట్రి కళగం (టీవీకె) ఆతిథ్యం ఇచ్చింది. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 83 మంది వరకు గాయపడ్డారు. కరూర్-ఈరోడ్ రహదారిపై ఉన్న వేలుసామిపురంలో ఈ సంఘటన జరిగింది, అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రచార ర్యాలీకి వచ్చారు. ఆయనను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు బారికేడ్లు దాటుకుని వేదికపైకి దూసుకెళ్లడంతో ఇది జరిగింది.

కరూర్ తొక్కిసలాట సంఘటనకు కారణం ?

విజయ్ వాహనం దాదాపు ఆరు గంటల ఆలస్యంగా రావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వేదికపై బారికేడ్ల వైపు దూసుకెళ్లడంతో రాత్రి 7:40 గంటలకు తొక్కిసలాట జరిగింది. విజయ్ తో పాటు వచ్చిన మద్దతుదారులు గుంపులో చేరడంతో సుమారు 4 వేల మంది హాజరైన ప్రారంభ సమావేశం గణనీయంగా పెరిగింది, దాని పరిమాణాన్ని సమర్థవంతంగా రెట్టింపు చేసింది. మహిళలు, పిల్లలతో సహా హాజరైన చాలా మంది, మండుటెండలో గంటల తరబడి వేచి ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870