हिन्दी | Epaper

KTR : గ‌చ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించిన కేటీఆర్

sumalatha chinthakayala
KTR : గ‌చ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించిన కేటీఆర్

KTR : కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతుందని కేటీఆర్ తెలిపారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ స్వాగతించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్‌కు వన్యప్రాణులను కాపాడాలంటూ ఆదేశాలు ఇవ్వడం గొప్ప విజయం.

గ‌చ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును

పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం

వన్యప్రాణుల పట్ల, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే ప్రతి ఒక్కరికి దక్కిన విజయం ఇది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతం ఇస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కేటీఆర్ కృతజ్ఞతలు

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. కంచ గచ్చిబౌలిని ప్రైవేట్ పార్టీకి తాకట్టు పెట్టిన రేవంత్ ప్రభుత్వ వ్యవహారంలో.. ఆర్థిక అవకతవకలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన కేంద్ర సాధికారిక కమిటీ మా పార్టీ వాదనను బలపరుస్తున్నది. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో పదివేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని చేసిన ఆరోపణలను కేటీఆర్ పునరుద్ఘాటించారు.

Read Also: ‘సురానా’ కంపెనీలపై ఈడీ దాడులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870