కేంద్ర ప్రభుత్వం ఆలిండియా సర్వీసెస్ అధికారుల కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలను అమలు చేయనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న జోనల్ సిస్టమ్ కు గుడ్‌బై చెబుతూ, ఇకపై అక్షర క్రమంలో గ్రూపు విధానం (Alphabetical Group System)ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల మంచి ర్యాంక్ సాధించిన అభ్యర్థులు కూడా దూరంగా ఉండే రాష్ట్రాల్లో పోస్టింగ్ పొందే అవకాశం ఉంది.
Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు
గ్రూపు విధానం ఎలా ఉంటుంది?
జాతీయ సమగ్రత, పారదర్శకత పెంచేందుకు ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. 2026 పాలసీ ప్రకారం, రాష్ట్రాలు ఖాళీల వివరాలను ఏటా జనవరి 31లోగా కేంద్రానికి పంపించాలి. కొత్త విధానంలో అభ్యర్థులు తమ గ్రూపులోని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఇతర గ్రూపుల నుంచి కూడా రాష్ట్రాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది స్టార్టింగ్ గ్రూప్ మారడం వల్ల, అభ్యర్థులు తమకు ఇష్టమైన రాష్ట్రాలకు కాకుండా, దూరంగా ఉన్న రాష్ట్రాల్లోనూ పనిచేయాల్సి రావచ్చు.

కొత్త గ్రూపులు ఇలా..
గ్రూప్ I: AGMUT (అరుణాచల్ ప్రదేశ్ – గోవా – మిజోరాం – కేంద్రపాలిత ప్రాంతాలు), ఆంధ్రప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్, ఛత్తీస్‌గఢ్.
గ్రూప్ II: గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్.
గ్రూప్ III: మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు.
గ్రూప్ IV: తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: