భార్యభర్తల మధ్య జరిగే గొడవల్లో ఆవేశంలో వాడే మాటలను ప్రతిసారీ ఆత్మహత్యకు ప్రేరేపణగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదని,ఇవే ఆరోపణలతో అరెస్టయిన ఓ వ్యక్తి శిక్షను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. భర్త అక్రమ సంబంధంపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భర్త ‘వెళ్లి.. చావు’ అని భార్యతో అన్నాడు. దీంతో ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడంతో భర్తపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు సమర్థించగా, హైకోర్టు కొట్టేసింది.
Read Also: Odisha: ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: