हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Transgender : ట్రాన్స్‌జెండర్ విషయంలో కేర‌ళ హైకోర్టు సంచలన తీర్పు

Sudheer
Transgender : ట్రాన్స్‌జెండర్ విషయంలో కేర‌ళ హైకోర్టు సంచలన తీర్పు

కేరళ హైకోర్టు (Kerala High Court) తాజాగా వెలువరించిన తీర్పు ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణలో మైలురాయిగా నిలిచింది. తిరువనంతపురం‌కు చెందిన జహాద్ (ట్రాన్స్‌మ్యాన్) మరియు జియా పావల్ (ట్రాన్స్‌వుమన్) అనే ట్రాన్స్‌జెండర్ (Transgender ) దంపతులు, తమ బిడ్డకు జనన ధృవీకరణ పత్రంలో తల్లి, తండ్రి అనే పదాలకు బదులుగా, లింగవిచారణ లేకుండా కేవలం “పేరెంట్స్” (తల్లిదండ్రులు) అనే పదాన్ని ఉపయోగించాలని కోర్టును ఆశ్రయించారు. ఈ దంపతులు తమ లింగ గుర్తింపులపై సామాజిక వివక్ష తలెత్తకుండా, తమ బిడ్డ భవిష్యత్తులో గందరగోళం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పూనుకున్నారు.

అధికారులను పట్టించుకోకపోవడంతో కోర్ట్ ను ఆశ్రయించిన దంపతులు

గతంలో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రంలో జహాద్‌ను తల్లి (ట్రాన్స్‌జెండర్)గా, జియాను తండ్రి (ట్రాన్స్‌జెండర్)గా పేర్కొనడం వీరికి అభ్యంతరకరంగా అనిపించింది. 2023 నుంచే ఈ మార్పు కోసం వారు అధికారులను కోరినప్పటికీ, వారి అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ ప్రాథమిక హక్కులను ఇది ఉల్లంఘించడమేనని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, బిడ్డకు తల్లిదండ్రుల పేర్లను లింగ రహితంగా నమోదు చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

ఈ తీర్పు ద్వారా కేరళ హైకోర్టు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులను కేవలం మాటలతో కాదు, చర్యల ద్వారా సాక్షాత్కరించినట్లైంది. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులను పరిరక్షించడంలో ఈ తీర్పు దేశవ్యాప్తంగా మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది. ట్రాన్స్‌జెండర్ సమాజం ఈ తీర్పును హర్షంతో స్వాగతించింది. ఇది భవిష్యత్‌లో లింగరహిత గుర్తింపులకు మరింత ప్రాధాన్యతనిచ్చే దిశగా, కొత్త చర్చలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Mehbooba Mufti: కశ్మీరీ పండిట్ల పునరావాసంపై ముఫ్తీ ప్రతిపాదన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870