కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు అమలు చేస్తున్న షూ–సాక్స్ పంపిణీ పథకంలో మార్పులు చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని జిల్లాల్లో బూట్లకు బదులుగా చెప్పులు ఇవ్వాలనే ప్రతిపాదనపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు.
Read also: Budget 2026: క్లీన్ ఎనర్జీ లీడర్‌గా భారత్?

Slippers should be distributed instead of shoes
వాతావరణ ప్రభావంతో వచ్చిన ఫిర్యాదులు
ఎక్కువసేపు షూలు ధరించడం వల్ల పిల్లల పాదాల్లో చెమట పేరుకుపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దుర్వాసన వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పాఠశాలలు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా వర్షాకాలం, వేసవికాలంలో షూలు అసౌకర్యంగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో చెప్పులు పిల్లలకు మరింత సౌకర్యంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాల వారీగా డేటా సేకరణ
ఈ మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేసే నిర్ణయం కాదని, ముందుగా జిల్లాల వారీగా వాతావరణం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై డేటా సేకరించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అందిన నివేదికల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: