RSS కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ అధికారి సస్పెండ్
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన కొద్ది రోజులకే, ఒక పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవంలో పాల్గొన్న కారణంగా సస్పెన్షన్‌కి గురయ్యారు. రాయచూరు జిల్లాలోని సిర్వార్ తాలూకాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ అధికారి (Karnataka) ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12న లింగసుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లో యూనిఫాం ధరించి పాల్గొన్నట్టు సమాచారం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు.
ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి అరుంధతి చంద్రశేఖర్ విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం, ప్రవీణ్ కుమార్ సివిల్ సర్వీసు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అతడు సస్పెన్షన్‌లోనే ఉంటారని, జీవనాధార భత్యం మాత్రమే అందుతుందని తెలిపారు.
Read also: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

పోలిటికల్ సెటింగ్‌లో పెద్ద దుమారం
ప్రవీణ్ కుమార్ (Karnataka) గతంలో లింగసుగూర్ ఎమ్మెల్యే మనప్ప వజ్జల్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారని సమాచారం. తాజాగా జరిగిన ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ – ఉద్యోగిని వెంటనే పునర్నియమించాలనీ, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజాస్వామ్య విధానాల్లోనే సరైన పోరాటం చేస్తామని హెచ్చరించింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రీయ స్థాయిలో ప్రజలలో ద్వేషాన్ని పెంచే కార్యక్రమాలకు లౌకిక రాజ్యాంగంలో స్థానం లేదని స్పష్టం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: