हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Delhi judge cash: నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

Vanipushpa
Delhi judge cash: నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధుల నుంచి తప్పిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

నోట్ల కట్టల కేసులో జడ్జిని విధుల నుంచి తొలగింపు

పోలీసులు తీసిన వీడియోలో..
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పోలీసులు తీసిన వీడియోలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించారు. ఆయన ఈ విషయాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందజేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై వెంటనే స్పందించి, నివేదికలోని ఫొటోలు, వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ
ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా విచారణ ప్రారంభించనుంది. అయితే, విచారణకు సంబంధించిన తుది గడువును మాత్రం నిర్ణయించలేదు.
తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర
జస్టిస్‌ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలను ఖండించారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎవరూ గదిలో నగదు కట్టలు ఉంచలేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. ఇది తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్ర అని ఆయన పేర్కొన్నారు. తమ నగదు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయని, తాము యూపీఐ మరియు కార్డులను ఉపయోగిస్తామని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870