हिन्दी | Epaper

Jharkhand: జార్ఖండ్‌లో భారీ వర్షాలు –162 మంది విద్యార్థులు వరదలో చిక్కుబడి..

Shobha Rani
Jharkhand: జార్ఖండ్‌లో భారీ వర్షాలు –162 మంది విద్యార్థులు వరదలో చిక్కుబడి..

జార్ఖండ్‌(Jharkhand)లో కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ఝార్ఖండ్‌ తూర్పు సింగ్భూమ్‌ (Singhbhum)జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరద కారణంతో ఒక ప్రైవేటు పాఠశాల ప్రాంగణం నీట మునిగింది. మొత్తం 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు.
స్కూల్ పైకప్పులపైకి తరలించబడిన విద్యార్థులు
దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు (Teacher) విద్యార్థులను తొలుత భవనంపైకి తరలించారు. అనంతరం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF)సిబ్బందికి సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న రెస్య్యూ బృందాలు గ్రామస్థుల సహాయంతో విద్యార్థులను రక్షించాయి. హల్దిపోఖర్-కోవాలి రోడ్డులోని పండర్సోలి వద్ద ఉన్న పాఠశాలలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. పాఠశాల భవనం నీట మునిగిపోవడంతో, ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ పైకప్పులపైకి తరలించారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 30న ఖుంటి, రాంచీ, రామ్‌గఢ్, బొకారో, ధన్‌బాద్, సరైకేలా-ఖర్స్వాన్, వెస్ట్ సింగ్‌భూమ్‌లకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయబడింది. జూలై 1న గుమ్లా, గర్వా, పాలము, చత్రా, లతేహర్, లోహర్‌దాగాలకు జారీ చేయబడింది.
రెస్క్యూ బృందాల హుటాహుటిన చర్య
సమాచారం అందుకున్న వెంటనే (NDRF) & పోలీస్ (Police)బృందాలు స్పాట్‌కు చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. స్థానిక గ్రామస్తులు కూడా సహాయంతో అన్ని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసివచ్చారు.

Jharkhand: జార్ఖండ్‌లో భారీ వర్షాలు –162 మంది విద్యార్థులు వరదలో చిక్కుబడి..
Jharkhand: జార్ఖండ్‌లో భారీ వర్షాలు –162 మంది విద్యార్థులు వరదలో చిక్కుబడి..

వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ
జూన్ 30: ఖుంటి, రాంచీ, రామ్‌గఢ్, బొకారో, ధన్‌బాద్, సరైకేలా-ఖర్స్వాన్, వెస్ట్ సింగ్‌భూమ్. జూలై 1: గుమ్లా, గర్వా, పాలము, చత్రా, లతేహర్, లోహర్‌దాగా జిల్లాలకు అలర్ట్ జారీ. పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలకు అనవసరంగా బయటకు రావద్దని సూచన. పాఠశాలలు, హాస్టల్స్ వద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also: Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870