Jhansi woman auto driver : ఉత్తర్ ప్రదేశ్‌లోని Jhansi జిల్లాలో సంచలనం సృష్టించిన తొలి మహిళా ఆటో డ్రైవర్ అనితా చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే ఈ హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు పోలీసుల చేతికి చిక్కడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల 4వ తేదీ రాత్రి ఝాన్సీలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సకున్వా ధుక్వాన్ కాలనీ వద్ద అనితా చౌదరిని దుండగులు కాల్చి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని, పక్కనే బోల్తా పడిన ఆటోను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు ముఖేశ్ ఝా, శివం, మనోజ్‌లపై కేసు నమోదు చేశారు.
Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు
దర్యాప్తులో భాగంగా శివం, మనోజ్‌లను పోలీసులు (Jhansi woman auto driver) అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడైన ముఖేశ్ ఝా పరారయ్యాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అతడు తన కారును Betwa River పై ఉన్న నోట్‌ఘాట్ వంతెన వద్ద వదిలిపెట్టి పారిపోయినట్లు గుర్తించారు.
శుక్రవారం రాత్రి భగవంతపురం సమీపంలోని మట్టి రోడ్డులో ముఖేశ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఈ సమయంలో అతడు పోలీసులపై కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఎస్పీ (సిటీ) ప్రీతి సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం ముఖేశ్, అనిత ఒకరినొకరు ప్రేమించి గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే కొద్దికాలానికే అనిత అతడిని విడిచిపెట్టింది. దీనిని ద్రోహంగా భావించిన ముఖేశ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. తమ పెళ్లి రోజు అయిన జనవరి 4న ఆమెను హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి ఒక పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: