Express timings : లింగంపల్లి–విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త టైమ్ టేబుల్ 2025 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం,
- 12805 లింగంపల్లి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి, రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నంకు చేరుతుంది.
- 12806 విశాఖపట్నం–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.20 గంటలకు విశాఖలో మొదలై, రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుతుంది.
ఇక సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు వీక్లీ ప్రత్యేక రైళ్లను (Express timings) రైల్వే మరికొన్ని వారాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
- సికింద్రాబాద్–అనకాపల్లి (07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో నడుస్తుంది.
- అనకాపల్లి–సికింద్రాబాద్ (07042) రైలు జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
అలాగే,
- హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో నడుస్తుంది.
- గోరఖ్‌పూర్–హైదరాబాద్ (07076) రైలు జనవరి 11, 18, 25 తేదీల్లో బయల్దేరుతుందని SCR ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :