కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ లాస్ట్ మూవీ ‘జన నాయకుడు’. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జననాయగన్ మూవీ (Jana Nayagan) కి సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. రాజకీయ కారణాలతో సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని టీవీకే ఆరోపిస్తోంది.
Read also: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?
సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం
కాగా విజయ్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారించనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం.. విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం అభిమానులను కలవర పెడుతోంది. ఇంతకీ జననాయగన్ (Jana Nayagan) అనుకున్న టైంకు థియేటర్లలోకి వస్తుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, సినీ జనాలు.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీ రోల్‌లో కనిపించనున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: