జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir blast) రాజధాని శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఆకస్మిక పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించగా.. 29 మంది గాయపడ్డారు. భారీ (Jammu & Kashmir blast) పేలుడు కారణంగా ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉండవచ్చు అనే ఊహాగానాలు వ్యాపించాయి.
Read Also: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు
ఈ ఉగ్ర సంస్థ చేసిన ప్రకటనను ఖండించారు
అయితే ఈ ఊహాగానాలను జమ్మూ కాశ్మీర్ డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) నలిన్ ప్రభావత్ పూర్తిగా తోసిపుచ్చారు. డీజీపీ నలిన్ ప్రభావత్ (DGP Nalin Prabhavat) మీడియాతో మాట్లాడుతూ.. “ఈ పేలుడు ఉగ్రవాదులు చేసిన దాడి కాదు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తూ జరిగింది” అని స్పష్టం చేశారు. పేలుడుకు సంబంధించిన పరిస్థితులను, దర్యాప్తు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

ఈ ఘటన ప్రమాదమే అని అధికారులు భావిస్తుండగా.. పీపుల్స్-యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ (PAFF) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ పీఏఎఫ్ఎఫ్ సంస్థ.. పాకిస్థాన్ ఆధారిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మహ్మద్ కు అనుబంధంగా పని చేస్తుందని భద్రతా సంస్థలు గుర్తించాయి.
అయితే డీజీపీ నలిన్ ప్రభావత్ ఈ ఉగ్ర సంస్థ చేసిన ప్రకటనను ఖండించారు. వారు కేవలం గందరగోళం సృష్టించడానికి, భయాందోళనలు రేకెత్తించడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: