ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ధృడంగా నిలిచింది. పహల్గాం దాడి తర్వాత భారత్ స్పందనను జైశంకర్ (Jaishankar) వివరించారు. అది కేవలం రెండు దేశాల మద్య సమస్య కాదన్నారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎదురుదెబ్బ అని చెప్పారు.పశ్చిమ దేశాలు భారత్-(Western countries India) పాక్ ఘర్షణను తేలికగా తీసుకున్నాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌ను వీరు చిన్నదిగా చూశారని విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ ఉదాహరణను కూడా గుర్తు చేశారు. అతను పాక్ మిలటరీ టౌన్‌లో ఎందుకు దాగాడు అని ప్రశ్నించారు.ఉగ్రవాదం కేవలం దక్షిణాసియాలోని సమస్య కాదు అన్నారు. ఇది యూరప్‌ను కూడా వెంటాడే భయం అని జైశంకర్ అన్నారు. ఈ అంశంపై ప్రపంచం ఒక్కటిగా స్పందించాలి అన్నారు.
భారత్ మౌలిక నమ్మకాల్లో యుద్ధానికి స్థానం లేదు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థంగా ఉంది. విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని జైశంకర్ స్పష్టం చేశారు. శాంతియుత పరిష్కారాలనే భారత్ కోరుతుందని వివరించారు. ఇది తమ చరిత్ర, సంస్కృతి నుంచి వచ్చిన నమ్మకం అన్నారు.
ఉక్రెయిన్‌తో కూడా భారత్‌కు మంచి సంబంధాలున్నాయి
కేవలం రష్యాతోనే కాదు, ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయి అన్నారు. భారతదేశం తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటుందని చెప్పారు. ప్రతి దేశానికీ స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయని స్పష్టం చేశారు.పాకిస్థాన్ ఆక్రమణను కొన్నప్పుడు చాలామంది మద్దతు ఇచ్చారు. అప్పట్లో సహాయం చేసినవాళ్లు ఇప్పుడు సూత్రాలు చెబుతున్నారని జైశంకర్ విమర్శించారు. ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.అమెరికా భారత్‌కు కీలక భాగస్వామి అన్నారు జైశంకర్. వ్యక్తుల వల్ల కాదు, దేశ ప్రయోజనాలకే బంధం అని అన్నారు. దేశ ప్రయోజనాలే మొదటే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Read Also : Tigers : ఆ కొంగకు ఎంత ధైర్యం : పులులతో పోరు..