భారతదేశం అప్పట్లో తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే గుర్తించబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్(IT Industry Growth) కంపెనీల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) భారత్‌ను వ్యూహాత్మక కేంద్రంగా మార్చాయి. కేవలం సర్వీస్ సెంటర్స్ కాదు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో ఇన్నోవేషన్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. వృద్ధి వేగం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. IT కంపెనీలతో పోలిస్తే GCCలు నాలుగు రెట్లు వేగంగా ఉద్యోగులను నియమిస్తున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ రిపోర్ట్ ప్రకారం GCC నియామకాలు ప్రతి సంవత్సరం 18-27% పెరుగుతున్నాయి, ఐటీ రంగం పెరుగుదల 4-6% పరిమితమై ఉంది. దేశంలో 1,600 పైగా GCCలు ఇప్పటికే పనిచేస్తున్నాయి, 2022లో 1.2 మిలియన్ల నిపుణుల సంఖ్య 2 మిలియన్లకు చేరింది. 2030 నాటికి 2,400 కేంద్రాలు ఏర్పడి, మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
Read also: Face Authentication: ఆధార్ కొత్త నియమాలు తెలుసా

టెక్ విప్లవం, ఉద్యోగ అవకాశాల పెరుగుదల
AI, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో(IT Industry Growth) విపరీతమైన డిమాండ్‌ను GCCలు తీర్చుతున్నాయి. ఈ కేంద్రాలు ఖర్చు ఆప్టిమైజేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఉపయోగించి ప్రొక్యూర్-టు-పే (P2P) ప్రక్రియలను సులభతరం చేస్తున్నాయి. కేవలం ఐటీ మాత్రమే కాకుండా, ఫైనాన్స్, సప్లై చైన్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో కూడా వ్యాపార వ్యూహాల రూపకల్పనలో GCCలు కీలకంగా మారాయి. GCCల ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి, జీతాల రేంజ్ పెరుగుతోంది. నాస్కామ్ అంచనా ప్రకారం, 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఆదాయంతో భారత్ టెక్ రంగంలో శక్తివంతమైన దేశంగా నిలుస్తుంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ ఈ మార్గంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: