ఢిల్లీ ప్రభుత్వం కాలం చెల్లిన వాహనాలపై (పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లు, డీజిల్ వాహనాలకు 10 ఏళ్లు) ఇంధనం నిషేధం (Fuel ban) విధించడం పలు వర్గాలలో తీవ్ర స్పందనను రేపుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది సొంత ఖర్చులతో కష్టపడి కొనుగోలు చేసిన బైకులు, కార్లను ఇంకా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా ఆ వాహనాలను స్క్రాప్ చేయాలని చెప్పడం వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది.
కొత్త వాహనాలు కొనాలంటే భారం – ప్రశ్నలు గలుగుతున్న ప్రజలు
ఒకసారి వాహనాన్ని స్క్రాప్ చేస్తే, మళ్లీ కొత్త వాహనం కొనడం సాధ్యమేనా? అని ప్రజలు (Delhi people) ప్రశ్నిస్తున్నారు. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువు, EMIలు, పెరిగిన ధరల మధ్య వాహనం మార్చడం సాధ్యం కాదని వారు వాపోతున్నారు. పాత వాహనాలు మెయింటెయిన్ చేస్తూ ఉపయోగించుకుంటేనే సరిపోతుందని భావించే మధ్య తరగతి ప్రజలకు ఈ నిబంధనలు తీవ్ర సమస్యగా మారాయి.
62 లక్షలకు పైగా వాహనాలకు నిషేధం – పరిష్కార మార్గాలపై చర్చ అవసరం
ప్రస్తుతం ఢిల్లీలో 62 లక్షలకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్లు అంచనా. వాటన్నింటినీ ఒకేసారి స్క్రాప్ చేయడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాతావరణ పరిరక్షణ అవసరమే అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందించకపోతే సాధారణ ప్రజలపై మోపబడే భారం ఎక్కువవుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునర్విచారించాలి, లేదా మధ్య తరగతి ప్రజలకు నష్టపోకుండా ఊరట కలిగించే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Read Also : Dr. B.V. Pattabhiram : డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత