Iran USA War: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య క్షిపణి దాడులు తీవ్రం కావడంతో అంతర్జాతీయ విమానయాన రంగం సంక్షోభంలో పడింది. భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మార్చి 15, తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలకు వెళ్లే ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Congress Candidate List Kerala: కేరళ ఎన్నికల వేళ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
ప్రయాణికులకు ఊరటనిచ్చే చర్యలు
యుద్ధం కారణంగా గగనతలం అస్థిరంగా మారడం, యూఏఈ ప్రభుత్వం విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించడమే దీనికి ప్రధాన కారణమని విమానయాన సంస్థలు తెలిపాయి. విమానాలు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి రిఫండ్ లేదా తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో ఉచితంగా టికెట్ మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి దాడులు జరుగుతున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం తమ గగనతలం, విమానాశ్రయాలపై కఠిన ఆంక్షలు విధించింది. క్షిపణుల ముప్పు పొంచి ఉన్నందున అంతర్జాతీయ విమానాల రాకపోకలను పరిమితం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: