భారత్‌పై పాకిస్థాన్ (India-Pak War) కుట్రపూరితంగా జరుపుతున్న కాల్పులు మానవత్వానికి మచ్చగా మారాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈనెల 7న పాక్ సైన్యం జరిపిన మోర్టార్ దాడుల్లో ఇద్దరు కవలలు ప్రాణాలు (Two twins survive) కోల్పోయారు. 12 ఏళ్ల జోయా, అయాన్ ఖాన్ అనే కవల పిల్లలు మృతిచెందగా, వారి తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పుట్టిన రోజు నాడే ప్రాణాలు కోల్పోయారు
తాజాగా పుట్టినరోజు జరుపుకొని హర్షం లోనయ్యిన జోయా, అయాన్ ఖాన్ అర్ధాంతరంగా తనువూ చాలించారు. వారు తమ కుటుంబంతో ఇంట్లో ఉన్న సమయంలోనే పాక్ సైన్యం (Pak army) ఆకస్మికంగా మోర్టార్ దాడికి పాల్పడింది. పేలుళ్ల శబ్దానికి పరిసర ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు. చిన్నారుల మృతితో వారి తల్లి తట్టుకోలేని దుఃఖంలో కన్నీరుపడుతోంది. ఆమె పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.
ఈ ఘటన పై భారత్ తీవ్ర ఆగ్రహం
ఈ అమానుష చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ ఉద్దేశపూర్వకంగా శాంతిని భంగం చేస్తూ సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటోందని భారత రక్షణ శాఖ మండిపడుతోంది. ఈ దాడులు జెనీవా ఒప్పందాలకు వ్యతిరేకమని, పాక్ బుద్ధి మారకపోతే తగిన ప్రతీకారం తప్పదని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేస్తూ మరింత అప్రమత్తంగా ఉన్నారు భారత భద్రతా దళాలు.
Read Also : War : భారత్ పై పాక్ మరోసారి డ్రోన్ల దాడి