ఇండియన్ రైల్వే (Indian Railways) సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు భారీ సౌకర్యాన్ని అందించేందుకు కొత్త టైమ్ టేబుల్ 2026ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టగా, 549 రైళ్ల వేగాన్ని పెంచారు. 86 రైళ్లను పొడిగించి, 10 రైళ్లను సూపర్ ఫాస్ట్గా మార్చారు. ఈ మార్పుల వల్ల 105 రైళ్లు తగిన మార్గాల్లో 30 నిమిషాల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోగలవు. దేశవ్యాప్తంగా ముఖ్య మార్గాల్లో ప్రయాణ సమయం తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించబడుతుంది.
Read also: WFH: టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

ప్రయాణికులు కొత్త షెడ్యూల్ వివరాలను IRCTC వెబ్‌సైట్, యాప్, లేదా రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. (Indian Railways) కొత్త టైమ్‌టేబుల్ అమలులోకి రావడం వలన, బజ్జి రైళ్లు, ఎక్స్‌ప్రెస్ ,సూపర్ ఫాస్ట్ రైళ్లు కోసం బుకింగ్ ప్లానింగ్ చేయడం మరింత సులభం అవుతుంది. ప్రధాన రూట్లలో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు మధ్య రైళ్ల వేగం పెంచడం, ప్రయాణ సమయాన్ని 15–60 నిమిషాల వరకు తగ్గించడం జరిగింది. రైల్వే శాఖ (Department of Railways) ప్రకారం, ప్రయాణికుల సౌకర్యం, సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణలలో ఈ మార్పులు కీలకంగా ఉంటాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: