డాక్ సేవ యాప్
భారతీయ తపాలా శాఖ తమ సేవలను(Indian post office) మరింత అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కొత్తగా డాక్ సేవ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఏ స్థలంలోనైనా ఆన్‌లైన్ సర్వీసులను పొందవచ్చు. ఈ కొత్త సేవ వలన ప్రజలు ఎలాంటి వాతావరణంలో కూడా తమ పోస్టల్ సేవలు సులభంగా పొందే అవకాశం పొందారు. ఏ పోస్టాఫీసులో ఉన్నా, వారు వారి మొబైల్(Mobile) ద్వారా వేగంగా, సౌకర్యవంతంగా అవసరమైన సేవలను పొందవచ్చు
Read also: అయ్యో తల్లి! ఎంత పనిచేశావ్?

స్మార్ట్ ఫోన్‌తో ఎక్కడి నుంచైనా సేవలు
ఈ అప్ (Indian post office) ద్వారా పార్సిల్ ట్రాకింగ్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్, పోస్టేజ్ కాలిక్యులేషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ వంటి రకరకాల సేవలను వినియోగించుకోవచ్చు. ఇతర సర్వీసులు కూడా యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ మనీ ఆర్డర్, స్పీడ్‌పోస్ట్, పార్సిల్ బుకింగ్‌ను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. ఇకపోతే, జీపీఎస్ సాయంతో సమీపంలోని పోస్టాఫీసుల వివరాలను క్షణాల వ్యవధిలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, బిజినెస్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన వింగ్స్ ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ యాప్ డౌన్‌లోడ్ చేయడం చాలా సులభం. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో డాక్ సేవ యాప్ టైప్ చేసి, భారత ప్రభుత్వం యొక్క అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాప్‌ను ఓపెన్ చేసి, మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వడం సరిపోతుంది. ఓటీపీ ద్వారా లాగిన్ చేసి, ఆపై తపాలా శాఖ సేవలను ఉపయోగించుకోవచ్చు.
తపాలా శాఖ చరిత్ర
భారత దేశంలో 1854లో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ తపాలా సేవలను ప్రారంభించారు. కాలక్రమంలో, 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 1,64,999 పోస్టాఫీసులు ఏర్పడతాయి. వీటిలో సుమారు 90.54% (1,49,385) గ్రామీణ ప్రాంతాల్లో, 9.46% (15,614) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలంగాణలో సుమారు 6,305 పోస్టాఫీసులు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 1869లో తిరుమలగిరి వద్ద హెడ్ పోస్టాఫీసు స్థాపించబడింది. ప్రస్తుతం అబిడ్స్‌లోని జనరల్ పోస్టు ఆఫీసు ప్రధాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: