పహల్గామ్‌లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఒక సంకల్పబద్ధమైన చర్యగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను గుర్తించి, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మెరుపుదాడులు జరిపింది. ఈ దాడులను భారత రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.
ఉగ్రవాద శిబిరాలే లక్ష్యం
ఈ దాడుల్లో ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా బహవల్పూర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన మదర్సా మరియు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్‌కి సమాచారం అందింది. ఈ సమాచారంతో భారత సైన్యం బహవల్పూర్‌పై తీవ్ర గగనదాడులు జరిపింది. దాంతో అక్కడున్న మదర్సాలో శిక్షణ పొందుతున్న 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
ఉగ్రవాదంపై భారత్ తన నిఖార్సైన స్థైర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది
పాకిస్థాన్ మీడియా కూడా ఈ దాడులకు సంబంధించిన వార్తలను ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ మరోసారి ఉగ్రవాదంపై తన నిఖార్సైన స్థైర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఈ సర్జికల్ దాడులు పాకిస్థాన్‌కు కట్టుదిట్టమైన హెచ్చరికగా నిలిచాయి. ఇకపై భారత్‌పై దాడులకు పాల్పడే ఏ ఉగ్రవాద సంస్థ అయినా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని ఈ చర్య స్పష్టం చేసింది.
Read Also : Pattabhiram : జగన్ పై విరుచుకుపడ్డ పట్టాభిరామ్