సింధు జలాల ఒప్పందం (Sindhu Jalala Oppandam)పై తలెత్తిన వివాదంలో భారత్ (India) తేలికగా వదిలేదేలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం (PCA) ఇచ్చిన తీర్పుపై దేశం స్పష్టమైన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.గురువారం విదేశాంగ శాఖ స్పష్టంగా తెలిపింది – PCA తీర్పులకు చట్టబద్ధత లేదని. ఆ కోర్టును భారత్ ఎప్పుడూ గుర్తించలేదని, దాని తీర్పులకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపించింది. ఆ కారణంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు వెల్లడించింది. ఇది పూర్తిగా సార్వభౌమ నిర్ణయమని వివరించింది.పాకిస్థాన్ విదేశీ వేదికలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న దేశం ఇప్పుడు న్యాయస్థానం రూపంలో నాటకం ఆడుతోందని ఆరోపించింది.

మధ్యవర్తిత్వ కోర్టు అధికార పరిధి ఏమాత్రం లేదు
PCA హేగ్‌లో పనిచేస్తున్నా, అది భారత్‌కు గుర్తింపు పొందిన సంస్థ కాదు. అందుకే ఆ తీర్పులు చట్టబద్ధమైనవి కావు. భారత్ సార్వభౌమాధికారాన్ని ఆ కోర్టు ప్రశ్నించలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.జూన్‌లో PCA ఇచ్చిన తీర్పు కిషన్‌గంగ, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై. అయితే, భారత్ అభిప్రాయం ప్రకారం, ఆ తీర్పు అనవసరమైంది. ఆ ప్రాజెక్టులపై పూర్తి హక్కు తమదేనని భారత్ స్పష్టం చేసింది.
పాక్ ఉద్దేశం – ప్రపంచ దృష్టిని మళ్లించడం
పాకిస్థాన్ ఎప్పటిలాగే అసత్య ప్రచారాలకు తెరలేపిందని భారత్ ఆరోపించింది. PCA తీర్పు ద్వారా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలనే పాక్ కుట్ర కొనసాగుతోందని స్పష్టం చేసింది.భారత ప్రభుత్వం వాదన చాలా క్లియర్‌గా ఉంది – ఒప్పందం అమలులో లేకపోతే, దాని నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. అంతేగాక, అక్రమంగా ఏర్పడిన కోర్టుకు తమపై అధికారమే లేదని తెలిపింది.
Read Also :