Rafale fighter jets : భారత రక్షణ రంగంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఫ్రాన్స్‌తో సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ డీల్ కింద మొత్తం 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఇది భారత రక్షణ రంగంలో అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’కి పెద్ద ప్రాధాన్యం ఇచ్చారు. మొదటి దశలో 18 రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ నుంచి నేరుగా రానుండగా, మిగిలిన విమానాలు భారతదేశంలోనే తయారు చేయనున్నారు. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతం లభించనుంది.
Read Also: Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
కొత్త రాఫెల్ జెట్లతో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది. ఆధునిక (Rafale fighter jets) సాంకేతికతతో కూడిన ఈ జెట్లు గగనతల భద్రతను బలపరుస్తాయి. అలాగే భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత దృఢపడనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: