Urea Price Hike: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతన్నల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం క్షిపణులకే పరిమితం కాకుండా, పొలాల్లో పండాల్సిన పంటలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమెరికాలోని సౌత్ డకోటా నుంచి ఆస్ట్రేలియా పొలాల వరకు ఇదే ఆందోళన కనిపిస్తోంది.
Read Also: Earthquake: రాజస్థాన్లో భూకంపం
గ్యాస్ సంక్షోభం: ఎరువుల ఉత్పత్తికి బ్రేక్!
ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూరియా, అమోనియం, ఇతర NPK ఎరువుల తయారీలో గ్యాస్ ప్రధాన ముడి పదార్థం. ఉత్పత్తి కేంద్రాలు మూతపడటం లేదా ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్లో ఎరువుల కొరత ఏర్పడింది. ఇది నేరుగా సరఫరా గొలుసును దెబ్బతీసి ధరలను పెంచుతోంది.కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే టన్ను యూరియా ధర 470 డాలర్ల నుంచి ఏకంగా 550 డాలర్ల మార్కును దాటేసింది.

సాధారణంగా ఒక రైతు సాగు ఖర్చులో ఎరువుల వాటా 50 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల నేరుగా రైతుల ఆర్థిక వెన్నుముకను విరుస్తోంది.ఎరువుల కొరత ఏర్పడితే అది నేరుగా దిగుబడులపై పడుతుంది. దిగుబడులు తగ్గితే మార్కెట్లో ధాన్యం, బియ్యం వంటి ఆహార పదార్థాల లభ్యత తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతుంది. “పొలంలో పంట పండి మన పళ్లెంలోకి రావడానికి 6 నుండి 9 నెలల సమయం పట్టవచ్చు కానీ, వచ్చే క్రిస్మస్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందని” నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: