हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Delhi Bomb Blast : ఆ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటె..వామ్మో ఎంతమంది చనిపోయేవారో..!!

Sudheer
Delhi Bomb Blast : ఆ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉంటె..వామ్మో ఎంతమంది చనిపోయేవారో..!!

ఢిల్లీలో ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ బ్లాస్ట్ మరింత పెద్ద ప్రమాదానికి దారితీయ అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రదేశం చాందినీ చౌక్ సమీపంలోని ఓల్డ్ లజపతిరాయ్ మార్కెట్ దగ్గర కావడంతో, సాధారణంగా అక్కడ ప్రతి రోజూ వేలాది మంది కొనుగోలుదారులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అదృష్టవశాత్తూ సోమవారం మార్కెట్ సెలవు రోజు కావడంతో జనసందోహం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో జరగకుండా తప్పిందని అధికారులు తెలిపారు.

Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ

చాందినీ చౌక్ ప్రాంతం ఢిల్లీలో అత్యంత రద్దీ ప్రాంతంగా పేరుగాంచింది. సాధారణ రోజుల్లో అక్కడ వాహనాలు కదలడం కూడా కష్టమే. అలాంటి చోట పేలుడు సంభవించడం వల్ల పరిస్థితి ఎంత భయంకరంగా మారేదో ఊహించుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. మంటలు వ్యాపించిన ప్రాంతం కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే పాత మార్కెట్ ఉండటంతో, అక్కడి షాపులు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. అయితే సోమవారం మూసివేసి ఉండడం వల్ల అనేక మంది వ్యాపారులు మరియు కొనుగోలుదారులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు.

ఘటనపై చాందినీ చౌక్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ భార్గవ్ మాట్లాడుతూ, “మార్కెట్ సాధారణంగా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈరోజు సెలవు కావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. భద్రతా కారణాల రీత్యా రేపు కూడా మార్కెట్‌ను మూసివేయాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. అంతేకాక, మార్కెట్ చుట్టుపక్కల భవనాల భద్రతా ప్రమాణాలు, విద్యుత్ లైన్లు, నిలిపి ఉన్న వాహనాలపై కూడా పోలీసులు కఠినంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం NSG, NIA బృందాలు సంఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరిస్తూ, పేలుడు మూలాలను విశ్లేషిస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870