हिन्दी | Epaper

IAS Couple Wedding: సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

Tejaswini Y
IAS Couple Wedding: సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

IAS Couple Wedding: నేటి కాలంలో వివాహ వేడుకలు అంటే కోట్ల రూపాయల ఖర్చు, భారీ ఆడంబరాలతో కూడుకున్నవిగా మారిపోయాయి. కానీ, ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు మాత్రం ఆ తతంగానికి దూరంగా ఉంటూ, అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకుని సమాజానికి గొప్ప ఆదర్శాన్ని చూపారు.

Read Also: BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం

IAS Couple Wedding: IAS couple got married simply at the Secretariat
IAS Couple Wedding: IAS couple got married simply at the Secretariat

మినీ సచివాలయంలో రిజిస్టర్ వివాహం

2023 బ్యాచ్‌కు చెందిన మాధవ్ భరద్వాజ్, అదితి వాష్ణ్యేలు రాజస్థాన్‌లోని అల్వార్ మినీ సచివాలయంలో కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు, బంధుమిత్రుల సందడి లేకుండా కేవలం దండలు మార్చుకుని వీరి వివాహ బంధం మొదలైంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎస్డీఎం (SDM) లుగా సేవలందిస్తున్నారు. వీరి సింపుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870