భారత్‌లో (India) తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు పట్టాలెక్కనుంది. (Hydrogen Train)ఈ రైలు హర్యానాలో ప్రారంభం కానుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ రైలు జీంద్-సోనీపత్ మార్గంలో ప్రయాణం చేస్తుంది. హైడ్రోజన్ ఇంధన సరఫరాకు జీంద్‌లో ప్రత్యేకంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబడింది, దీని సామర్థ్యం 3,000 కిలోల హైడ్రోజన్ ఇంధనం. ఈ ప్లాంట్‌కు 11 కేవీ విద్యుత్ సరఫరా అందించబడుతుంది, దీని ద్వారా రైలుకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుంది.
(Hydrogen Train) ప్రాజెక్ట్ ప్రగతిని సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి, దక్షిణ హర్యానా బిజ్‌లీ వితరణ్ నిగమ్ అధికారులు భేటీ అయ్యారు. ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉంది, త్వరలోనే రైలు ప్రారంభించనుంది. దేశంలో మొదటి హైడ్రోజన్ రైలుగా ఇది చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం పొందనుంది.
Read also: IIFL: 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: