దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించి ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు స్టేషన్లతో పాటు దేశంలోని మరో 70 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు(Holding areas) ఏర్పాటు చేయనుంది.
Read Also: TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే?

మహా కుంభమేళా సమయంలో ఢిల్లీలోని స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన(Holding areas) తర్వాత ప్రయాణికుల భద్రత, నియంత్రణ కోసం రైల్వే ఈ చర్యలు చేపడుతోంది. ఢిల్లీలో రూపొందించిన “యాత్రి సువిధా కేంద్ర”(Tourist convenience center) మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో టికెట్ కౌంటర్, విశ్రాంతి గదులు, తాగునీటి సదుపాయం, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా రద్దీ సమయాల్లో ప్రయాణికులు భద్రంగా, సౌకర్యవంతంగా వేచి ఉండే వీలుంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: