ఈశాన్య భారతదేశానికి ప్రధానంగా దేశ మిగతా ప్రాంతాలతో అనుసంధానించే మార్గం అయిన ‘చికెన్ నెక్ కారిడార్’ గురించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జియో-స్ట్రాటెజిక్ ప్రాధాన్యం కలిగిన ఈ కారిడార్ విషయంలో కొంతకాలంగా భారతదేశంపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడే ప్రకటనలు బంగ్లాదేశ్ పక్షం నుంచి రావడంతో, శర్మ ఘాటుగా స్పందించారు.

చికెన్ నెక్ కారిడార్ – భారతదేశానికి లైఫ్లైన్
బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా మాట్లాడుతూ, భారత్‌కు ఒక చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కు అలాంటివి రెండు ఉన్నాయని, అవి మరింత బలహీనమైనవని తెలిపారు. భారత్ ను బెదిరిస్తే బంగ్లాదేశ్ కే నష్టమని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో సన్నగా ఉండే సిలిగురి కారిడార్ ద్వారానే ఈశాన్య భారతదేశం మిగతా దేశంతో అనుసంధానమై ఉంటుంది. దీని వెడల్పు సుమారు 22 నుంచి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.
హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
ఈ అంశంపై హిమంత బిశ్వ శర్మ ఈనెల 25న సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో బంగ్లాదేశ్‌లోని రెండు కీలకమైన, బలహీనమైన ప్రాంతాలను ప్రస్తావించారు. మొదటిది, దక్షిణ దినాజ్‌పూర్ (భారత్) నుంచి నైరుతి గారో హిల్స్ (మేఘాలయ) మధ్య విస్తరించి ఉన్న 80 కిలోమీటర్ల ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే, మొత్తం రంగ్‌పూర్ డివిజన్ బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఇక రెండోది, దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వైపు వెళ్లే 28 కిలోమీటర్ల చిట్టగాంగ్ కారిడార్ అని వివరించారు. బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టగాంగ్‌ను, రాజకీయ రాజధాని ఢాకాతో కలిపే ఏకైక మార్గం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.
Read also: PM Unemployment Insurance Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!