
హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నేపాల్‌కు చెందిన ఒక చిన్నారి మృతి చెందగా, మరో తొమ్మిది మంది వలస కూలీలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాలు, దుకాణాల్లో మంటలు చెలరేగడంతో పరిస్థితి భయానకంగా మారింది.
Read Also: Hyderabad crime: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

అగ్ని ప్రమాదం తీవ్రతకు సుమారు 10 నుంచి 15 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలుడే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక(Himachal Pradesh) దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గల్లంతైన వలస కూలీల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం కారణాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: