Himachal Pradesh snowfall : గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించిన కొండ ప్రాంతాలు మొత్తం తెల్లటి మంచు దుప్పటితో కప్పబడి ఉన్నాయి. ఈ తీవ్ర హిమపాతం కారణంగా 1200కు పైగా రోడ్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నప్పటికీ, పరిస్థితులు మాత్రం తీవ్రంగా మారాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలి, బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, మనాలి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. విపరీతమైన చలితో ప్రజలు నిత్యజీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల

భారీ హిమపాతంతో పాటు వర్షాలు కూడా కురవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు పేరుకుపోవడంతో వాహనాలు రోడ్లపై నిలిచిపోగా, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. గంటల తరబడి ప్రయాణికులు (Himachal Pradesh snowfall) మంచులోనే వేచి ఉండాల్సి వస్తోంది. విద్యుత్, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.
రాబోయే రోజుల్లో హిమపాతంతో పాటు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ప్రజలు అత్యవసర ప్రయాణాలు మానుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: