हिन्दी | Epaper

Harish Rana: 13 ఏళ్ల నరకం.. కారుణ్య మరణంపై జనవరి 13న తుది విచారణ

Pooja
Harish Rana: 13 ఏళ్ల నరకం.. కారుణ్య మరణంపై జనవరి 13న తుది విచారణ

గత 13 ఏళ్లుగా స్పృహ లేకుండా జీవచ్ఛవంలా మారిన హరీశ్ రాణాకు(Harish Rana) కారుణ్య మరణం (పాసివ్ యూతనేషియా) అనుమతించాలా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసు న్యాయపరంగానే కాకుండా, నైతికంగా కూడా కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్న నేపథ్యంలో, జనవరి 13న హరీశ్(Harish Rana) తల్లిదండ్రుల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

Read also :Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

Harish Rana
13 years of hell… the final hearing on euthanasia is on January 13th.

13 ఏళ్లుగా స్పృహలేని జీవితం..

జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. ఈ కేసులో ఇక నిర్ణయం తీసుకోవాల్సిన దశకు చేరుకున్నామని వ్యాఖ్యానించింది. హరీశ్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఎయిమ్స్ సెకండరీ మెడికల్ బోర్డు సమర్పించిన నివేదికను పరిశీలించాలని న్యాయవాదులను ఆదేశించింది.

“ఆ నివేదిక అత్యంత బాధాకరం. ఇది మా ముందు ఉన్న పెద్ద సవాలు. అయితే ఆ యువకుడిని శాశ్వతంగా ఇలాగే ఉంచడం కూడా సాధ్యం కాదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులు, సోదరులతో న్యాయమూర్తులు చాంబర్‌లో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

హరీశ్ కేసు నేపథ్యం

2013లో చండీగఢ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో హరీశ్ రాణా నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడు స్పృహ కోల్పోయి పూర్తిగా ఇతరులపై ఆధారపడే స్థితికి చేరుకున్నాడు. పీజీఐ చండీగఢ్, ఎయిమ్స్, ఫోర్టిస్ వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఇన్నేళ్లుగా కుటుంబ సభ్యులే ఇంట్లోనే అతడికి సంపూర్ణ సంరక్షణ అందిస్తున్నారు. దీని వల్ల వారు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. హరీశ్‌కు కారుణ్య మరణం అనుమతించాలంటూ కుటుంబం గతంలో 2018, 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

అయితే తాజాగా హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదిక స్పష్టంగా పేర్కొనడంతో, మూడోసారి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. నిబంధనల ప్రకారం పాసివ్ యూతనేషియాకు ప్రాథమిక, ద్వితీయ వైద్య బోర్డుల అనుమతి తప్పనిసరి. వైద్యుల అభిప్రాయాలు, కుటుంబ సభ్యుల సమ్మతిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870