हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్

sumalatha chinthakayala
నూతన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్

నేటితో ముగియనున్న ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హరియాణా సీఎ్‌సగా విధులు నిర్వర్తిస్తున్న వివేక్‌ జోషి (1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

నూతన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్

కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీగా వారు ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జ్ఞానేశ్‌కుమార్‌ (61) గతంలో పలు కీలక శాఖల్లో సేవలందించారు. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసే బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించిన పత్రాల వ్యవహారాన్ని.. హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు.

కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకం

‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌’ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కేంద్ర సహకార శాఖల కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో ఆయన రిటైర్‌ అయ్యారు. సీఈసీ పదవిలో 2029 జనవరి 26 దాకా ఆయన కొనసాగనున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి.. ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అప్పాయింట్‌మెంట్‌ కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టర్మ్‌ ఆఫ్‌ ఆఫీ్‌స)చట్టం-2023’ పేరుతో రూపొందించిన కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకం ఇదే మొదటి సారి కావడం విశేషం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870