हिन्दी | Epaper

ప్రధాని మోదీని కలిసిన గుకేశ్

Sudheer
ప్రధాని మోదీని కలిసిన గుకేశ్

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. చెస్‌లో తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గుకేశ్, ఈ సందర్భంగా మోదీతో తన విజయ ప్రయాణం గురించి చర్చించారు. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేశ్‌ను ప్రధాని అభినందించారు. ఈ ప్రత్యేక కలయిక సందర్భంగా మోదీ గుకేశ్ కు చెస్ బోర్డు కానుకగా అందజేయడం విశేషం. శాలువాతో సత్కరించి గుకేశ్‌ను ప్రోత్సహించారు. గుకేశ్ వంటి యువ ప్రతిభలు భారతదేశానికి భవిష్యత్తులో మరిన్ని గౌరవాలను తీసుకురావడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. దేశానికి మరింత పేరు తెచ్చేలా పనిచేయాలని గుకేశ్‌కు సూచించారు. మోడీ ని కలవడం తన జీవితంలో మరచిపోలేని సంఘటన అని గుకేశ్ అన్నారు. “ప్రధాని మోదీ వంటి గొప్ప నేతతో కలవడం నా జీవితంలో గొప్ప గుర్తుగా నిలుస్తుంది” అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

గుకేశ్ చెస్ ప్రపంచంలో అతి చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. భారత చెస్ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రాసిన గుకేశ్, ఇప్పటికీ కొత్త రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ విజయాల వెనుక తన కుటుంబం, గురువుల సహకారం అపారమని గుకేశ్ తెలిపాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ ని సైతం గుకేశ్‌ను కలవడం జరిగింది. రజనీకాంత్ వంటి దిగ్గజం తన విజయాలను ప్రశంసించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గుకేశ్ తెలిపాడు. దేశంలోని అగ్రశ్రేణి వ్యక్తుల అభినందనలు గుకేశ్ ప్రతిభకు నిదర్శనం. దేశ యువతకు గుకేశ్ ప్రేరణగా నిలుస్తున్న ఈ సంఘటన చెస్‌కు కూడా మంచి గుర్తింపునిచ్చేలా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

విజయ్ పార్టీ పొత్తులపై కీలక నిర్ణయం?

విమాన ప్రయాణీకులు ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

విమాన ప్రయాణీకులు ఇకపై దానికి ఎక్స్ ట్రా ఛార్జీ అవసరం లేదు!

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. రాహుల్ గాంధీతో కీలక భేటీ!

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ.. రాహుల్ గాంధీతో కీలక భేటీ!

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!

ఉజ్వల పథకం ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం

ఉజ్వల పథకం ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం

9వ తరగతి సిలబస్ మార్పుపై సలహాలు, సూచనలు చేయండి

9వ తరగతి సిలబస్ మార్పుపై సలహాలు, సూచనలు చేయండి

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం తండ్రిని బస్తాలో కుక్కిన కూతురు
0:56

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కోసం తండ్రిని బస్తాలో కుక్కిన కూతురు

11 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి!

11 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి!

ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

ఇండోర్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!
0:30

ఇండోర్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఏడుగురు సజీవదహనం!

📢 For Advertisement Booking: 98481 12870