గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. “ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు” అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Read Also: Trump: ట్రంప్ మనకు తండ్రా ఏంటి: కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు

10 మంది కొత్త వారికి అవకాశం
మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: