हिन्दी | Epaper

Gujarat Crime: గుడి బాత్రూంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Saritha
Gujarat Crime: గుడి బాత్రూంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Gujarat Crime: గుజరాత్‌లోని సూరత్‌లో అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ స్వామినారయన్ ఆలయ సముదాయంలోని బాత్రూంలో ఇద్దరు యువతులు మృతదేహాలుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మరణించిన వారు కాలేజీ విద్యార్థినులుగా గుర్తించారు.

ఆ ఇద్దరు విద్యార్థినులు విషపూరితమైన మందులను ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సిరింజ్, మూడు ఖాళీ విషపు మందుల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

Read Also: SBI Research: ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పు

Gujarat Crime: గుడి బాత్రూంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
Gujarat Crime: Two female students commit suicide in temple bathroom

ఈ కేసులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు ఆ విద్యార్థినులు తమ మొబైల్ ఫోన్లలో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? ఏ మందులు వాడాలి? అనే విషయాలను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారు గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపంలో ఉన్నట్లు వారి సెర్చ్ హిస్టరీని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870