हिन्दी | Epaper

Kerala: ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

Vanipushpa
Kerala: ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

రోడ్ల‌పై వాహ‌నాలు వెళ్లాలి.. ఫుట్‌పాత్‌ (footpath)ల‌పై జ‌నం న‌డ‌వాలి.. ఇది బేసిక్ థింగ్‌. కానీ మ‌న దేశంలో చాలా వ‌ర‌కూ ఫుట్‌పాత్‌ల‌ను కూడా రోడ్లుగా వాడేస్తున్నారు. జ‌నాల‌కు న‌డిచేందుకు కూడా వీలులేకుండా వాహ‌న‌దారులు ఫుట్‌పాత్‌పై ర‌య్ ర‌య్ మంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా బైక‌ర్‌లు. రోడ్డుపై కొంచెం ట్రాఫిక్ క‌నిపించినా స‌రే వెంట‌నే ఫుట్‌పాత్‌పైకి వాహ‌నాన్ని ఎక్కించేస్తుంటారు. ఇలాంటి దృష్యాలు మ‌న దేశంలోని చాలా సిటీల్లో క‌నిపిస్తాయి. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వాహ‌నాల‌ను చూస్తూ ఉండిపోతాం కానీ.. అడ్డుకునే ప్ర‌య‌త్నం మాత్రం చేయం. కానీ ఓ బామ్మ మాత్రం అలా అడ్డ‌దిడ్డంగా వెళ్తున్న ఓ వాహ‌న‌దారుడిని న‌డిరోడ్డుపై ఆపి క‌డిగి పారేసింది. ఇదేం ప‌ని.. నీకు అస‌లు సివిల్ సెన్స్ ఉందా..? లేదా..? అంటూ నిల‌దీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Read Also: Municipal Election Results: కరీంనగర్‌లో అధిక్యం దిశగా బీజేపీ

Kerala: ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం
Kerala: ఫుట్‌పాత్ మీదకు బండేసుకొచ్చిన వ్యక్తికి బామ్మ గుణపాఠం

మేం ఎక్క‌డ న‌డ‌వాలి?

ఓ ఫుట్‌పాత్‌పై వాహ‌నం న‌డిపేందుకు య‌త్నించిన ఓ బైక‌ర్‌ను బామ్మ ధైర్యంగా అడ్డుకుంది. ఇదేంట‌ని రోడ్డుమీదే నిల‌దీసింది. మీరు ఫుట్‌పాత్‌ల‌పై కూడా వాహ‌నాలు న‌డిపితే.. మేం ఎక్క‌డ న‌డ‌వాలి అంటూ ప్ర‌శ్నించింది. ఆ బైక‌ర్‌ను ముందుకు పోనీకుండా అడ్డుకుంది. అత‌డు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో నంబ‌ర్ ప్లేట్ ఫొటో తీసేందుకు కూడా ప్ర‌య‌త్నించింది. దీంతో చేసేదేమీ లేక స‌ద‌రు వాహ‌న‌దారుడు వెన‌క్కిమ‌ళ్లి త‌న వాహ‌నాన్ని రోడ్డుపైకి మ‌ళ్లించాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌ (Kerala)లోని కోజికోడ్‌ (Kozhikode)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ బామ్మ‌ను చూసైనా మ‌నం నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870