SBI Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లతో పాటు కొన్ని టర్మ్ డిపాజిట్లపై వడ్డీలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
Read also : iPhone 15: జియోమార్ట్‌లో ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపు!

లోన్ తీసుకున్నవారికి లాభం
ఈ మార్పులతో హోం లోన్లు, వాహన రుణాలు, MSME లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (Marginal Cost of Funds Based Lending Rate)ను SBI 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఒక సంవత్సరం కాలపరిమితి గల MCLR 8.70 శాతంగా నిలిచింది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (External benchmark lending rate)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.90 శాతంగా నిర్ణయించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి వర్తించే బేస్ రేటును కూడా 10 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది.
బ్యాంకింగ్ కస్టమర్లకు రిలీఫ్
ఇక మరోవైపు రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. 2 నుంచి 3 సంవత్సరాల లోపు డిపాజిట్లపై వడ్డీని 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిపై వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. అదేవిధంగా ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక స్థితి బలపడటంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం వాటికి కొత్తగా మూలధనం కేటాయించలేదని ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :