German girl in India : భారతీయుల ఆతిథ్యం, స్నేహభావాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ జర్మనీకి చెందిన యువతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ భారత పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వీడియో రూపంలో పంచుకోవడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల భారత్‌కి వచ్చిన జెన్నిఫర్ అనుకోకుండా తన క్రెడిట్ కార్డు, పర్సు పోగొట్టుకుంది. పూర్తిగా అపరిచిత దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే ఈ సమయంలో భారత్‌లో ఉన్న ఆమె స్నేహితులు వెంటనే అండగా నిలిచారు. పర్యటన పూర్తయ్యే వరకు అవసరమైన ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చి ఆమెకు సహాయం చేశారు.
Read Also: Manipur Violence: మణిపుర్లో మరోసారి అల్లర్లు

తన వీడియోలో జెన్నిఫర్ మాట్లాడుతూ, “ఇక్కడ నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు అవసరమైన డబ్బును అడగకుండానే అందించారు. నా ప్రయాణం మొత్తం నేను ఎలాంటి భయం లేకుండా పూర్తి చేశాను. ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని ఊహించలేదు” అని తెలిపింది. పర్యటన పూర్తయ్యాక అందరి డబ్బులు తిరిగి చెల్లించానని కూడా పేర్కొంది.
భారతీయుల స్నేహం, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ఆమె స్పష్టం చేసింది. ఈ వీడియో రెండు రోజుల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు భారతీయుల మంచితనాన్ని ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: