हिन्दी | Epaper

Gaurav Gogoi : హిమాంత ‘అస్సాం జిన్నా’ .. గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

Sudha
Gaurav Gogoi : హిమాంత ‘అస్సాం జిన్నా’ .. గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్‌ గొగోయ్‌ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేనివారిగా మిగిలిపోతారని విమర్శించారు. గువాహటిలో గొగోయ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అస్సాం కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై గొగొయ్‌ (Gaurav Gogoi) మాట్లాడుతూ.. కమలంలో చేరితే బోరా కూడా ప్రాధాన్యం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

Read Also : http://Defence Deal: భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

Gaurav Gogoi
Gaurav Gogoi

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోరాటం కాంగ్రెస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారికి మధ్య ఉంటుందని గొగోయ్‌ అన్నారు. బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ మాజీ నాయకులు ఉన్నారని, అవినీతిపరులని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మపై విమర్శలు చేశారు. బోరా కాంగ్రెస్‌ను వీడటంవల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870