మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పటికే పబ్బులు, క్లబ్బులు, బార్లు భారీ ఎత్తున న్యూఇయర్ వేడుకలను సర్వం సిద్ధం చేశాయి. ఇక మద్యం కూడా భారీగా అమ్ముడు అవుతున్నది. మత్తుపదాలు చాపకింద నీరులా నగరాలకు చేరుతున్నది. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరాను అడ్డుకోలేకపోతున్నారు. (Ganjaayi) గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చి పోతున్నారు. విదేశాల నుంచి మత్తుపదార్థాల సరఫరా యదేచ్చంగా అవుతున్నది. తాజాగా ముంబయి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read also: Artificial Intelligence: ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

కలకలం రేపిన ముంబయి గంజాయి
తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి (Mumbai) వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. (Ganjaayi) ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఏకంగా రూ.40కోట్ల విలువైన 40 కెజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి ముంబయికి చేరిన గంజాయి బ్యాంకాక్ నుంచి వచ్చిన 9మంది స్మగ్లర్లు లగేజ్ బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలించే యత్నం చేశారు.
వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజ్ బ్యాగుల్లో దాచిన భారీ మొత్తంలో విదేశీ గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎన్ఎపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ అక్రమ రవాణా వెనుక ఉ్న నెట్ వర్క్ పై దర్యాప్తు చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కేజీల విదేశీ గంజాయి పట్టుబడటంతో ముంబయి విమానాశ్రయంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: